GNTR: తెనాలి పట్టణంలోని పడమర కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం సోమవారం ఉదయం వెలుగుచూసింది. మార్కెట్ వంతెన సమీపంలో దుస్తులు లేని స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీ శివలింగేశ్వర స్వామి సేవా సమితి సభ్యుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం


