హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్ల స్థలాల కోసం దివ్యాంగులు నిరసన

NDL: పాణ్యం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం దివ్యాంగులు ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రతి దివ్యాంగుడికి కూటమి ప్రభుత్వం మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.