హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి'

BDK: దమ్మపేట నెమలిపేటలో అరెకరం పట్టా భూమి కొనుగోలు చేసి, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పందించాలని సీపీఐ(ఎంఎల్) నాయకుడు పండూరి వీరబాబు ఇవాళ డిమాండ్ చేశారు. పట్టా,ప్రభుత్వ భూముల సరిహద్దుల పై సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను స్థానికులకు వెల్లడించాలని కోరారు.