హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌట్ల(కె) పంట పొలంలో కొండచిలువ హల్ చల్

NRML: నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్ల(కె)లో నది మార్గంలో ఉన్న పొలంలో భారీ కొండచిలువ సంచరిస్తోందని గుర్తించిన గ్రామస్తులు సోమవారం ఉదయం దానిని హతమార్చారు. నిమ్మ నర్సయ్య పంట పొలంలో ఉన్న కొండచిలువను గుర్తించి స్థానికులకు సమాచారం అందించాడు. ఇప్పటికే ఆ పరిసరాలలో మేక పిల్లలు కనిపించకపోతుండటంతో ఆందోళనలో ఉన్న గ్రామస్తులు ఒకేసారి కొండచిలువను చూసి భయాందోళనలకు గురయ్యారు.