హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి'

HNK: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాల క్రీడా పోటీలు నేటి నుంచి 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల పురుషుల ఖో-ఖో జట్టు సభ్యులు గ్రౌండ్లో పూజలు నిర్వహించారు. కేయూ ఈసీ మెంబర్ రాజుగౌడ్ మాట్లాడుతూ... క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.