హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం

MDK: జిల్లా కేంద్రంలోని న్యూ హైస్కూల్లో సోమవారం ఎంఈవో శంకర్ సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం అందించడం వల్ల పాఠశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. హరేకృష్ణ మిషన్ సహకారంతో పథకం అమలవుతోందని తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.