BHPL: గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ నవదుర్గా మాత ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పది రోజుల్లో అమ్మవారు విభిన్న రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 15న స్వామివారి కల్యాణం, 17న వార్షికోత్సవం జరుగుతుందని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు శ్రీ నవదుర్గ ఆలయ కమిటీ తెలిపింది.
తెలంగాణ
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


