హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం దరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన సాధారణ తనిఖీలో ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను పరిశీలించారు. గోదాము వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు కొనసాగించాలని, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.