హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సన్న రకం వరితో మంచి లాభాలు

NLR: సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది మంచి లాభాలు అందుతున్నాయి. జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాగా వ్యాపారులు క్వింటాలుకు రూ.3,500 చొప్పున చెల్లిస్తున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే 31.5 % ఎక్కువ కావడం విశేషం. ఎల్‌నినో ప్రభావం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడం ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణం. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.