హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణి సంరక్షణ అవగాహన బైక్ ర్యాలీ

NZB: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రేంజ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.