కృష్ణా: అవనిగడ్డలోని వలంద పాలెం వద్ద తూర్పు కాల్వపై నిర్మించిన కాలిబాట వంతెన శిథిలావస్థలో ఉంది. వంతెన అడుగు భాగాన సిమెంటు పెచ్చులూడి పోయి ఇనుప చువ్వలు బయటకు కన్పిస్తున్నాయి. రెయిలింగ్ విరిగిపోయి స్తంభాలే మిగిలాయి. వంతెనపై వలందపాలెం, సర్దాకోడు గ్రామాలకు చెందిన వారు ప్రయాణాలు సాగిస్తుంటారు. అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ దారిలో యాదిమారిస్తే కాల్వలోకే..!


