హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డంపింగ్‌ యార్డును తలపిస్తున్న వైనం

WG: కాళ్ల మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో ప్రధాన డ్రెయిన్లో ఇలా వ్యర్థాలు పేరుకుపోయి డంపింగ్ యార్డును తలపిస్తోంది. చుట్టు పక్కల నివాసాల నుంచి చెత్త సేకరణ సక్రమంగా చేయకపోవడమే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీనిలో మురుగు ముందుకు సాగే అవకాశం లేక దుర్వాసన వస్తోందని, దోమల బెడదతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.