SRD: నారాయణ్‌ఖేడ్ మండలం లింగాపూర్‌లో నీటి సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేడు ‘జల్ మహోత్సవ్’ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, పరిశుభ్రత పాటించాలని RWS ఏఈ శ్రీకాంత్ ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రుక్మిణి హనుమాన్లు, ఉపసర్పంచ్ మల్లేశం, కార్యదర్శులు పాల్గొన్నారు.
తెలంగాణ
"లింగాపూర్ లో జల్ మహోత్సవ్ కార్యక్రమం"


