హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు

అల్లూరి జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గూడెంకొత్తవీధి మండలంలో భారీ నష్టం వాటిల్లింది. కొండవాగులు పొంగి రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రధాన మార్గాలకు గండి పడడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.