హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరం పై దాడి... ఏడుగురు అరెస్ట్

కోనసీమ: రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్వేదిపాలెంలో పేకాట స్థావరాలపై సోమవారం దాడులు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సఖినేటిపల్లి SI హరికోటి శాస్త్రి తెలిపారు. పేకాట ఆడుతున్న వారి నుంచి రూ.5,830 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అందిన ముందస్తు సమాచారంతోనే ఈ దాడి చేశామన్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.