హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్లపల్లి, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు ఆర్టీసీ సర్వీసులు

MDCL: చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయని చెంగిచర్ల డిపో మేనేజర్‌ కవిత తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12.20 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.