AKP: యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ దుర్గాభవాని అమ్మవారి పందిరి రాట వేసారు. గ్రామానికి చెందిన పలకా రమేష్-లక్ష్మి దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు జరిపి అనంతరం గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు రాట వేశారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలకు పందిరి రాట


