హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డెల్టా కాలువలకు భారీగా నీటి విడుదల

BPT: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,225 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం బ్యారేజిలో నీటిమట్టం 12 అడుగులకు చేరడంతో నీటిని వదిలారు. దుగ్గిరాల హైలెవెల్ ఛానల్‌కు 140, రేపల్లె కాలువకు 962, తూర్పు ఛానల్‌కు 507, పశ్చిమ కాలువకు 67, కొమ్మమూరు కాలువకు 1,310 క్యూసెక్కులు విడుదల చేశారు.