హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షం.. మునిగిన రైల్వేస్టేషన్

W.G: భీమవరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. మెయిన్ రోడ్డుపైకివర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే స్థాని రైల్వేస్టేషన్ ప్రాంగణమంతా వర్షపునీటితో నిండిపోవడంతో చెరువును తలపించింది. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.