హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు లోహిత్ సాయి, అనుదీప్ రాజ్

ADB: స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీల్లో లోహిత్ సాయి, అనుదీప్ రాజ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11న HYDలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వారు అర్హత సాధించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణకుమార్ తెలిపారు.