హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కందికుంట సమక్షంలో టీడీపీలోకి చేరికలు

SS: కదిరిలోని 23వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరాయి. కటిక షేక్ హస్నూ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.