హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుత్తలూరులో రోడ్డు ప్రమాదం

NLR: దుత్తలూరు మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేల్ నుంచి ఒంగోలు వైపు బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు స్కూల్ సమీపానికి చేరుకునే సమయంలో ఆర్టీసీ బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు.