హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుబాయిలో గుండెపోటుతో పెగ్గెర్ల వాసి మృతి

JGL: కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన మోర్తాడు గంగారాం(58) దుబాయిలో మృతి చెందారు. ఆబుదాబిలో జీసీసీ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన ఈనెల 1న పని ప్రదేశంలో గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వ సాయం కోరుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.