కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక సమీపంలో నదిలో గల్లంతైన మునిపల్లి బాలస్వామి (70) మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పశువులు మేపడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం


