హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దసరా ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

NDL: రుద్రవరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఇవాళ ఆర్యవైశ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 11 నుంచి 21 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా అమ్మవారి బిందె సేవ, పండుగ రోజున మెరవణి నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.