మార్కాపురం జిల్లా కున్నంపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య రాళ్ల దాడి


