ATP: పామిడి మండలం అప్పాజీపేటలో వింత ఘటన జరుగుతోంది. వారం రోజులుగా రాత్రి వేళల్లో ఇళ్లపై అకస్మాత్తుగా రాళ్లు పడుతుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు, యువకులు కొండపైకి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలోనూ రాళ్లు పడటం ఆందోళనకు గురిచేసింది. అధికారులు స్పందించి కారణాలను గుర్తించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రి వేళల్లో ఇళ్లపై రాళ్లు


