హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 6న జిల్లాకు రానున్న గవర్నర్‌

MDK: గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈనెల 6న జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. మ.2.30 గంటలకు ఐడీఓసీకి చేరుకుని నషా ముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులతో భేటీ అవుతారు. రామాయంపేటలో ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో 35 వేల జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.