KMR: కామారెడ్డి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పిట్లం మండలంలో నిన్న గరిష్టంగా 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారి మండలంలో కనిష్టంగా 31.9 డిగ్రీలు నమోదైంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పంట పొలాలకు వెళ్లి ఎండలో పనిచేయాలంటే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
కామారెడ్డిలో పెరిగిన ఎండ తీవ్రత


