హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐలు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా మునిస్వామి

WG: తణుకు పట్టణానికి చెందిన న్యాయవాది కామన మునిస్వామి ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్ ‌ (ఐలు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 3, 4 తేదీల్లో నెల్లూరులో జరిగిన ఐలు రాష్ట్ర మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల నుంచి మునిస్వామిని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎంపిక చేశారు.