హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పైడిమర్రి పేరు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి'

NTR: తిరువూరుకు చెందిన ఇంగ్లీష్ టీచర్, జెవివి ప్రతినిధి యం. రాం ప్రదీప్, భారత దేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. గుంటూరులో సర్వేపల్లి ప్రతిభా పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణ రావులకు ఆదివారం ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.