BDK: బూర్గంపాడు మండలం, సారపాకలో ఐటీసీ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలపై గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిశ్రమ నుంచి కాలుష్యంతో కూడిన వ్యర్థ జలాలను బయటకు వదలడం సరికాదని, సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఐటీసీ కాలుష్యంపై ఆందోళన


