హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువ వైపు దూసుకెళ్లిన బస్సు

కోనసీమ: హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న ప్రైవేట్ బస్సు కే.గంగవరం మండలం బాలాంతరం వద్ద అదుపు తప్పి పంట కాలువ వైపు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న కాలువ గట్టుపై బస్సు నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ రహదారి అధ్వానంగా ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.