హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీశైలం మార్గంలో ఎలుగుబంటి హల్‌చల్

NDL: సున్నిపెంట–శ్రీశైలం మార్గంలోని ముఖద్వారం వద్ద అర్ధరాత్రి ఎలుగుబంటి సంచరిస్తూ భక్తులకు కనిపించింది. రోడ్డు పక్కన చెట్ల మధ్య ఆహారం కోసం వెతుకుతున్న ఎలుగుబంటిని ప్రయాణికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో రాత్రివేళ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.