హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా మహోత్సవాలకు ఎంపీ బాలశౌరికి ఆహ్వానం

కృష్ణా: మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో ఎంపీ వల్లభనేని బాలశౌరిని దుర్గగుడి ఆలయ అధికారులు కలిశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఎంపీకి వివరించారు.