హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై జొన్నలు.. ప్రయాణికుల ఇబ్బందులు

HNK: దామెర మండలం దుర్గంపేట నుంచి సీతారాంపురం, అగ్రంపహాడ్‌ వెళ్లే రహదారిపై రైతులు జొన్నలు ఆరబోస్తుండటంతో సోమవారం వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మూలమలుపుల వద్ద సైతం జొన్నలు ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రోడ్డుపై పెద్ద రాళ్లను అడ్డుగా పెడుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.