VZM: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లమ్మ జాతరలో కీలక ఘట్టమైన సిరిమాను ఉత్సవానికి సిద్ధమవుతున్నారు. ఈ జాతరలో ఉపయోగించే సిరిమాను చెట్టును విజయనగరం మండలంలోని జొన్నవలసలో గుర్తించారు. ఏటా ఆలయ ప్రధాన పూజారికి కలలో అమ్మవారు దర్శనమిచ్చి చెట్టును సూచించడం ఆనవాయితీ. ఈ ఏడాది జొన్నవలసకు చెందిన శ్రీనివాసరావు రవికి చెందిన వృక్షాన్ని ఎంపిక చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విజయనగరంలో సిరిమాను చెట్టు గుర్తింపు


