హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ శిక్షణ దరఖాస్తుకు నేటితో ముగింపు

ADB: గిరిజన యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న 100 మంది అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత వసతి, శిక్షణ అందించనున్నారు. ఈ నెల 7న ధ్రువపత్రాల పరిశీలన, 9న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.