హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రానైట్ లారీల ఓవర్ లోడ్‌తో రోడ్డు ధ్వంసం

KNR: సైదాపూర్ మండలంలో గ్రానైట్ లారీల ఓవర్ లోడ్‌తో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఘనపూర్, ఆకునూర్, జాగీర్పల్లి గ్రామాల మీదుగా రాత్రింబవళ్లు తేడా లేకుండా భారీ లారీలు తిరుగుతుండటంతో రహదారులు గుంతలమయంగా మారాయి. క్వారీల నిర్వాహకులు లాభాలు ఆర్జిస్తూ రోడ్ల మరమ్మతులను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.