హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ..!

MDCL: ఉప్పల్‌ పరిధిలో గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు చెక్కులు అందని అర్హులైన లబ్ధిదారులు వెంటనే మున్సిపల్‌ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. చెక్కులు అందడం లేదనే ఆరోపణలకు అధికారులు పంపిణీతో చెక్‌ పెట్టారు.