WG: తణుకు పట్టణ ప్రతిష్ఠాత్మక చిహ్నం 'ఐ లవ్ తణుకు' నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన మహిళా కళాశాల వద్ద లక్షలు వెచ్చించి దీన్ని నిర్మించారు. ప్రారంభంలో వేసిన పచ్చదనం సైతం కనుమరుగవుతోందని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థకు చేరిన 'ఐ లవ్ తణుకు' చిహ్నం


