హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యక్తిని ఢీకొట్టిన బైకు.. మృతి

ప్రకాశం: టంగుటూరు గ్రామం నుంచి కొండేపి వెళ్లే రోడ్డులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండకు రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని మోటార్ సైకిల్ ఢీకొట్టింది. గాయపడిన వ్యక్తిని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తి రిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.