హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సారెస్పీకి 1,042 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

KNR: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం ఉదయం 1,042 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నీటిమట్టం 329.31 మీటర్లు, నీటి నిల్వ 46.06 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి 1,938 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఇందులో సరస్వతి కాలువకు 300, గుత్ప ఎల్ఐఎస్‌కు 376, అలీసాగర్‌కు 360, మిషన్ భగీరథకు 231, కాకతీయకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.