హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ పథకం పేరుతో వసూళ్ల దందా

జిల్లాలో సీఎంఆర్ఎఫ్ పేరుతో దళారులు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. ఆర్ఎంపీలు అనారోగ్యంతో ఉన్నవారిని ఖమ్మం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం తరలిస్తున్నారు. చెల్లించిన బిల్లులు తిరిగి సీఎంఆర్ఆఫ్ ద్వారా వస్తాయంటూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకి చెందిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.