NRML: నిర్మల్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేడు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టరేట్ క్యాంప్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లాలో మంత్రుల పర్యటన, అనంతరం సమీక్ష సమావేశం ఉన్నందున వేదికను మార్చినట్లు వారు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
తెలంగాణ
నేడు ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి


