హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బిల్లులు అందక లబ్ధిదారుల ఆందోళన

NRPT: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందక ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 7,383 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం దశల వారీగా చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపు నెలల తరబడి జాప్యం కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.