హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

HYD: బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ గోడౌన్‌లో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా.. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.