MHBD: తొర్రూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ గణేష్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటిని తనిఖీ చేసి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశామన్నారు. అనుమానిత వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ వచ్చిందని వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
'అంబేద్కర్ కాలనీలో పోలీసుల ముమ్మర తనిఖీలు'


