హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుకాణాల్లో తూనికలు కొలతల అధికారుల తనిఖీలు

WGL: తూకాల్లో మోసాలకు ఒడిగడితే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా తూనికల కొలతల అధికారి కె. మనోహర్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని చేపలు, మాంసం, చికెన్, దుకాణాలపై ఆదివారం సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ధ్రువీకరణ చేయించుకోకుండా శాఖ ముద్రలు వేయించుకోకుండా వినియోగిస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.