హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 6న గంగమ్మ గుడిలో వరుణ హోమం

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఈనెల 6న వరుణ హోమం, వరుణ జపం నిర్వహించనున్నారు. 14 మంది వేద పండితులతో ఉదయం 6.54 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాగా, 10.30 గంటలకు అమ్మవారికి 108 బిందెలతో జలాభిషేకం చేయనున్నారు. భక్తులు, ప్రజలు పాల్గొనాలని ఆలయ ఛైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, పాలకమండలి సభ్యులు, ఈవో జయకుమార్ ఓ ప్రకటనలో కోరారు.